Total Pageviews

Monday, May 4, 2020

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                     
 *శ్రీమతే రామానుజాయ నమః!*   
      *మార్గం వంశ వృక్షం* 
             (పుట్టుక దాని విస్తరణ)
                 -:ముందు మాట:-     

*మార్గం వంశం*  పుట్టు పూర్వోత్తరాలు, దాని విస్తరణ  గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో , *మార్గం వంశ వృక్షం* ను తయారు చేయడానికి ఉపక్రమించాను.  దీనిని  తయారు చేయడానికి  చాలామంది  బంధువులు , చాల చక్కగా స్పందించారు, సహకారాలను  అందించారు. వారిలో ముఖ్యంగా శ్రీ మార్గం శశిధర్ గారు సంపూర్ణమైన సమాచారాన్ని ,సహకారాన్ని అందించారు. అందరికి పేరు పేరున ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను. 

నేడు యాంత్రిక జీవితాల కారణంగా మరియు సెల్ ఫోన్ , కంప్యూటర్ల  వినియోగం అధిక మవడం వలన , జ్ఞ్యాపక శక్తి తగ్గిపోతుంది . పది ఫోన్ నెంబర్లు కూడా గుర్తుండటం లేదు . తన కుటుంబం పేర్లు తప్పా, ఇతర కుటుంబాల వారి పేర్లు చెప్ప లేక పోతున్నాం . అలాంటిది  తాతల , ముత్తాతల పేర్లు ఎలా జ్ఞ్యాపకముంటాయి చెప్పండి. మనకే కాకుండా రేపటి తరాలకు , వారి తాతల ముత్తాతల పేర్లు , వంశాల పేర్లు , గోత్రాలు పేర్లు  తేలియాలన్న సదుద్దేశంతోనే "మార్గంవంశవృక్షం" తయారు చేయడానికి ఉపక్రమించాను. 

మార్గం వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, వారి వంశ మూలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వలన  మనకు ఎన్నో  గమ్మతైనా  విషయాలు తెలుస్తాయి. పూర్వ కాలంలో  వారు ఎలాంటి వృత్తులు చేసేవారో , ఎవరెవరి  ఇంటి పేరు వాళ్ళతో అధికంగా  వివాహాలు  చేసుకునే వారో  తెలుసుకోవచ్చు.  అందులో  ఎంతో థ్రిల్ ఉంటుంది.  మన బంధు వర్గం ఎంత వరకు విస్తరించిందో / ప్రాకిందో తెలుస్తుంది. మన బంధు వర్గం  ఎక్కడెక్కడ నివశిస్తున్నారో  తెలుస్తుంది .  ఎలాంటి ఉద్యోగాలు చేశారో , చేస్తున్నారో తెలుస్తుంది . తాత ముత్తాతల , తల్లి దండ్రుల పాపా పుణ్యాలు  , వారి కొడుకులకు , మనుమలకు ఎలా అంటుతున్నాయో , లేదో  కూడా  పరిశోధన చేయడానికి  అవకాశం కల్పిస్తుంది . ఇప్పటి వరకు , ప్రతీది పూర్వ జన్మ సుకృతం అనే  వాదన ఉంది . పురాణాలూ  అవే  చెబుతున్నాయి. ఇది ఎంత వరకు నిజం ?
అలానే  , వీటిని గుర్తు పెట్టుకోవచ్చు . మన తరాలకు తెలియ జేయ వచ్చు. సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేశాను. ఎవరికైనా  ఇంకా బాగా తెలిసినా , ఏమైనా  అభ్యంతరాలు ఉన్నా తెలుపగలరు . సంతోషంగా  శ్వీకరిస్తాను . సరి చేస్తాను.

సుమారుగా  150  సంవత్సరాల క్రితం దేశమంతా శ్రీ వైష్ణవ మత ప్రచారం కోసం వెళ్లి నట్లుగానే , తమిళనాడు  (నేడు చెన్నయ్ ) నుండి  లింగంపెల్లి అనే గ్రామానికి   (అప్పటికి  మనకు స్వాతంత్య్రం రాలేదు , రాష్ట్రాలు  ఏర్పడలేదు) కాలి  నడకన  *శ్రీ మార్గం పరాంకుశం* అనే  శ్రీవైష్ణవ మత ప్రచారకుడు  వచ్చి నట్లుగా మన పూర్వీకుల ద్వారా తెలియ వచ్చింది. అప్పుడు  వీరి వయస్సు  సుమారుగా 20-22 సంవత్సరాలు . ఈ ప్రాంతానికి  వచ్చాకనే , 25  సంవత్సరాల  వయస్సులో  ఇక్కడే ఒక యువతిని  వివాహం చేసుకోవడం జరిగింది . ఆ యువతి పేరు ఏమిటో  తెలియదు .
వివాహం అయిన కొంత కాలానికి , వారికి ముగ్గురు  అబ్బాయిలు  జన్మించారు .
వారిలో, పెద్దబ్బాయి  పేరు  *శ్రీ మార్గం నర్సయ్య* ,
రెండవ అబ్బాయి పేరు *శ్రీ మార్గం రామయ్య* ,
మూడవ  అబ్బాయి పేరు  *శ్రీ మార్గం పాపయ్య* .
వీరు  హరి దాసులుగా  తిరగడం , ఆయుర్వేద వైద్య వృత్తిని  మరియు  వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా  తీసుకున్నట్లుగా  కన బడుతుంది . స్త్రీలు  విస్తర్లు కుట్టడం మరియు వ్యవసాయ వృత్తులు లేదా ఇంటివద్దనే ఉన్నట్లుగా మనకు  తెలుస్తుంది.

కొంత కాలం తరువాత , అంటే వీరికి యుక్త వయస్సు వచ్చాక  , పెద్దబ్బాయి  అయిన  శ్రీ మార్గం నర్సయ్య గారికి  శ్రీమతి నర్సమ్మ గారిని ఇచ్చి వివాహం చేశారు . (శ్రీమతి నర్సమ్మ గారి ఇంటి పేరు తెలుసుకోవాలి )
అలానే  రెండవ  అబ్బాయి అయిన  శ్రీ మార్గం రామయ్య గారికి  శ్రీమతి బుచ్చమ్మ గారిని  ఇచ్చి  వివాహం  చేశారు. (శ్రీమతి బుచ్చమ్మ గారి ఇంటి పేరు తెలుసుకోవాలి ).
ఇక  మూడవ అబ్బాయి అయిన  శ్రీ మార్గం పాపయ్య గారికి  ఒక అమ్మాయితో వివాహం జరిపించారు .

కొంత కాలానికి , అక్కడి పరిస్థితులు  , వాతావరణం  సరిపడక  , రెండవ అబ్బాయి అయిన శ్రీ మార్గం రామయ్య గారు , కొడుకండ్లకు ( వరంగల్  జిల్లా ) వచ్చి స్థిర పడి పోయారు  . ఇక్కడకు వచ్చాకనే  శ్రీమతి బుచ్చమ్మగారిని  వివాహం చేసుకున్నారు. ఇక మిగిలిన  ఇద్దరు అబ్బాయిలు , లింగంపెల్లి లోనే స్థిర పడి పోయారు.

నోట్ :  *మార్గం మహా వృక్షాన్ని  32 భాగాలుగా  విభజించడం  జరిగింది*. 

No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM