Total Pageviews

Saturday, May 2, 2020

MARGAM VAMSHA VRUKSHAM - 2


                                                   *మార్గం వంశ వృక్షం*
                                                            (పుట్టుక  దాని విస్తరణ)
  
                                                                           -2-
వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడానికి శ్రీమాన్ పరాంకుశం గారు , తమిళనాడు నుండి  కాలి నడకన , నడక మార్గాన వచ్చినట్లు తెలుసుకున్నాం . మార్గం అంటే  దారి లేదా బాట  అని అర్ధం. నడక మార్గాన  వచ్చాడు కాబట్టి , వారి ఇంటి పేరు *మార్గం* అని స్థిరపడింది అని చెప్పవచ్చు. పూర్వ కాలంలో  మనుష్యులను  గుర్తించడానికి , ఇలా రక రకాల  గ్రామాల పేర్లు , ప్రాంతాల పేర్లు , వృత్తుల పేర్లు , సేవల పేర్లు , వారి పెంచుకున్న జంతువుల పేర్లు , *మఠాల* పేర్లు , ఇంటిపేర్లుగా  మారాయి .  పూర్వకాలంలో  శ్రీ రామానుజులవారి  *విశిష్టాద్వైత సిద్ధాంతాలను* ప్రచారం చేయడానికి ,   74  *మఠాలు* ఏర్పాటు చేశారు. ఉదా: పరవస్తు మఠం, తాళ్లూరి మఠం  మొ .నవి. ఇప్పుడు పరవస్తు ఇంటి పేరు వారు , తాళ్లూరి ఇంటిపేరు వారు ఉన్నారు . మన చాత్తాద శ్రీ వైష్ణవ కులంలో చాలామంది ఇంటిపేర్లు , తమిళనాడు గ్రమాల పేర్లు , శ్రీ రామానుజుల వారి ఇతర పేర్లు  కలిగి ఉంటారు .
(మనుష్యుల  కులాలు , పేర్లు , ఇంటి పేర్లు , గోత్రాలు  ఎలా ఏర్పడ్డాయి , ఎలా మార్పులు చెందుతాయి  అనేవి , వివరంగా , www.sollutions2all.blogspot .com లో సవివరంగా తెలియ జేశాను. అవసరమున్న వారు చూడవచ్చు. )

*శ్రీమాన్ మార్గం పరాంకుశం* గారికి  ముగ్గురు అబ్బాయిలు  అని తెలుసుకున్నాం. ఇప్పుడు  వారి ఒక్కొక్క అబ్బాయి  సంతానం గురించి , వృత్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం.

ముందుగా , వారి పెద్ద కొడుకు పేరు *శ్రీమాన్ మార్గం నర్సయ్య*  మరియు వారి భార్య పేరు  *శ్రీమతి నర్సమ్మ* గారు. వీరు లింగంపెల్లి లోనే  స్థిర పడి పోయినారు . వీరికి  ముగ్గురు  అబ్బాయిలు.  వారు ,
1 . *శ్రీమాన్ మార్గం జీడయ్య* గారు
2 . *శ్రీమాన్ మార్గం కిష్టయ్య* గారు
3 . *శ్రీమాన్ మార్గం వెంకయ్య* గారు

ఈ ముగ్గురు కొడుకులు   లింగంపెల్లి లోనే  స్థిర నివాసం  ఏర్పరుచుకుని  జీవించ సాగారు . వీరి ప్రధాన  వృత్తి వ్యవసాయము.

వీరికి యుక్త  వయస్సు  వచ్చాక  ఒకరి వెనుక  ఒకరికి  వివాహాలు  జరిపించారు .
*శ్రీమాన్ మార్గం జీడయ్య* గారికి  వివాహం చేశారు (భార్య పేరు తెలుసుకోవాలి). వీరికి  ఇద్దరు కొడుకులు. ఒక కూతురు .
కొడుకులు :
1 . *శ్రీమాన్ మార్గం పెద్ద అంతయ్య* గారు (వీరిని పెద్ద ఎంకయ్య అని పిలిచే వారు)
2 . *శ్రీమాన్ మార్గం చిన్న అంతయ్య* గారు (వీరిని చిన్న ఎంకయ్య అని పిలిచే వారు)
కూతురు:
1 . *శ్రీమతి మార్గం అంతమ్మ* గారు
వీరి ప్రధాన వృత్తి కూడా  వ్యవసాయం మరియు ఇంటి పని మాత్రమే. ఎవరూ పెద్ద చదువులు చదివినట్లుగా గాని, ఉద్యోగాలు చేసినట్లుగా గాని  దాఖలాలు లేవు.


No comments:

Post a Comment

MARGAM MAHA VAMSHA VRUKSHAM (MUNDU MATA)

                                                        *శ్రీమతే రామానుజాయ నమః!*            * మార్గం వంశ వృక్షం*                 (పుట్...

MARGAM VAMSHA VRUKSHAM